ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంతరించిపోతున్న కళలను వెలికితియ్యడమే మా లక్ష్యం' - Manchu Vishnu Art Foundation latest news in telugu

భారతదేశంలో అంతరించిపోతున్న కళలను వెలికి తీయడంలో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ ముందు ఉంటుందని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 36 మంది కొయ్య కళాకారులు 20 రోజులపాటు కళాఖండాలను పౌండేషన్ ఆధ్వర్యంలో తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Manchu Vishnu Art Foundation conducted making art at chandragiri

By

Published : Nov 15, 2019, 7:05 PM IST

అంతరించిపోతున్న కళలను వెలికితియ్యడమే మా లక్ష్యం

భారతదేశంలో అంతరించిపోతున్న కళలను వెలికి తీయడంలో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ ముందు ఉంటుందని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. చంద్రగిరి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలలో మంచు విష్ణు ఆర్ట్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్రచందనం చెక్కలతో అద్భుత కళాఖండాలు తయారీకి కళాకారులు శ్రీకారం చుట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 36 మంది కొయ్య కళాకారులు 20 రోజులపాటు ఈ కళాఖండాలను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటి తయారికి ప్రభుత్వం... అటవీ శాఖ అనుమతి తీసుకునే ఈ ప్రయత్నం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ కళాకారులు గురజాల రమేష్, రాధా వినోద్ శర్మ వారి అనుచరులతో ఈ కళాఖండాలు రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు. దేశంలో ఉన్న కళాకారులను ఈ విధంగానైనా గుర్తించి వెలుగులోకి తీసుకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details