చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలంలోని గొల్లవానికాలువకు చెందిన సుబ్రమణ్యం, రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరికి గ్రామంలో కొంత భూమి ఉంది. భూసేకరణలో భాగంగా ఈ భూమిని ప్రభుత్వం తీసుకుని... పరిహారంగా రూ.1కోటి 65లక్షలు ఇచ్చింది. ఈ నగదును సుబ్రమణ్యం... తన కొడుకులకు ఇచ్చి.. రూ.పది లక్షలు కుమార్తెకు ఇవ్వాలని కోరాడు. ఇందుకు నిరాకరించిన వారు... శనివారం రాత్రి సుబ్రమణ్యంతో గొడవ పడ్డారు. ఈ ఘటనపై మనస్తాపం చెందిన సుబ్రమణ్యం తొండవాడ సమీపంలోని మామిడితోటలో ఉరి వేసుకుని మృతి చెందాడు.
సుబ్రమణ్యం మృతిపై అతని భార్య రాధమ్మ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బుల కోసం కన్న కొడుకులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని అరోపించింది. పూర్తి స్థాయిలో విచారించి తనకు న్యాయం చేయాలని కోరింది.