భార్య, అత్త, ఆమె కుమార్తెల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. ఫేస్బుక్ లైవ్‌లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
గుంటూరుకు చెందిన శంకరనారాయణ కుమారుడు ఉదయ్ భాస్కర్ కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. మదనపల్లెకు చెందిన సోనీతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి ఉదయ్ భాస్కర్ భార్య సోనీ పుట్టింటికి వెళ్లింది. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నట్లు చెప్పాడు. ఫేస్బుక్లో ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే అతను మృతి చెందాడు.