చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా పులివెందులకు చెందిన 55 ఏళ్ల రాజు..తుమ్మలగుంటలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన రాజు , మిత్రుడైన రషీమ్‌ను డబ్బు కావాలని అడిగగా..అతను లేదని చెప్పాడు. మనస్తాపానికి గురైన రాజు ..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య..
మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో జరిగింది.
తుమ్మలగుంటలో వ్యక్తి ఆత్మహత్య