CRIME:మదనపల్లెలో దారుణం...మద్యంమత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి నరికివేత - చిత్తూరు జిల్లా ముఖ్యంశాలు
00:21 January 17
మద్యం మత్తులో వ్యక్తి దారుణహత్య
CRIME:చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వలసపల్లెలోని ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టెలును బలిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో ఓ వ్యక్తి... పొట్టెలును పట్టుకున్నమరో వ్యక్తిని నరికాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి టి. సురేశ్ గా పోలీసులు గుర్తించారు. పశువుల పండుగలో భాగంగా పొట్టేలును బలిచ్చే కార్యాక్రమం నిర్వహించగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: