చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంట అటవీ ప్రాంతంలో ఉన్న గంగన్న శిరస్సు జలపాతంలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పలమనేరు మండలం సముద్రపల్లె గ్రామానికి చెందిన తిరుమలేష్(36) స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లాడు. సరదాగా నీళ్లలో దిగి కేరింతలు కొడుతూ స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పొట్టన పెట్టుకున్న సెల్ఫీ... గంగన్న శిరస్సు జలపాతంలో వ్యక్తి మృతి - గంగన్న శిరస్సుపై వార్తలు
సెల్ఫీ సరదా ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంట అటవీ ప్రాంతంలో ఉన్న గంగన్న శిరస్సు జలపాతంలో పడి తిరుమలేష్(36) అనే వ్యక్తి మృతి చెందాడు.
![పొట్టన పెట్టుకున్న సెల్ఫీ... గంగన్న శిరస్సు జలపాతంలో వ్యక్తి మృతి Man dies in Gangana head waterfall while taking selfie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8093070-860-8093070-1595208594314.jpg)
గంగన్న శిరస్సు జలపాతంలో వ్యక్తి మృతి