ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాడ్జీలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి - పీలేరులోని లాడ్జిలో వ్యక్తి మృతి తాజా వార్తలు

లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన.. చిత్తూరు జిల్లా పీలేరులో జరిగింది. పాలసముద్రానికి చెందిన సుబ్రహ్మణ్యం రాజు (45) లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో.. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే నోటి నుంచి నురగలు వస్తుండడంతో పురుగుల మందు తాగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

man dead suspiciously
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

By

Published : Apr 6, 2021, 2:03 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాలసముద్రం మండలం టీవీఎన్​ఆర్​పురానికి చెందిన సుబ్రహ్మణ్యం రాజు (45) జేసీబీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన సోమవారం ఓ మహిళను వెంటబెట్టుకుని పట్టణంలోని ఎల్​బీఎస్ రోడ్డులోగల ఓ లాడ్జికి వచ్చి గదిని అద్దెకు తీసుకున్నాడు. కొంత సేపటికి ఆ మహిళ వెళ్లిపోయింది. తరువాత ఎంతసేపటికి సుబ్రహ్మణ్యం రాజు గది తలుపులు తీయకపోవటంతో.. అనుమానం వచ్చిన నిర్వాహకులు రాత్రి గడియను తొలగించారు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వటంతో.. వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే నోటి నుంచి నురగలు వస్తుండటంతో.. పురుగుల మందు తాగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details