ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో మునిగి.. అయ్యప్ప భక్తుడు మృతి - చిత్తూరు జిల్లాలో చెరువులో మునిగి వ్యక్తి మృతి

అయ్యప్ప మాల వేసుకోవాలనుకున్నాడు ఓ భక్తుడు. అంతా సిద్ధం చేసుకున్నాడు. స్నానం చేయటానికి తోటి వారితో కలసి చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

man died in pond
చెరువులో మునిగి వ్యక్తి మృతి

By

Published : Jan 10, 2021, 11:11 AM IST

చిత్తూరు జిల్లా కురబలకోట మండల పరిధిలోని మట్లివారిపల్లి నివాసి వెంకటరమణ (35) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. అయ్యప్ప మాల వేయడానికి ముందు గ్రామం సమీపంలోని సీతారాం చెరువులోకి స్నానం చేయడానికి సహచర స్వాములతో కలసి వెళ్ళాడు. లోతుగా ఉన్న చెరువు మధ్యలోకి వెళ్లి వెనక్కి రావడానికి ఊపిరి ఆడక మునిగిపోయాడు.

ఈ విషయాన్ని వెంకటరమణ సహచర స్వాములు తెలిపారు. అప్పటికే చీకటి పడిన కారణంగా.. మృతదేహం వెతకడం సాధ్యం కాలేదని... ఆదివారం వెలికితీత చర్యలు చేపడతామని ముదివేడు పోలీసులు తెలిపారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details