Elephants attack: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీభత్సం సృష్టించాయి. గజరాజుల గుంపు దాడిలో ఒకరు ప్రాణాలు పోగొట్టున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం రాత్రి తమిళనాడు అడవుల్లో నుంచి ఏపీ పరిధి గుడిపల్లె మండలం చిగురుగుంట అటవీ ప్రాంతానికి చేరుకున్న గజ రాజులు ఇద్దరిపై దాడి చేశాయి. తమిళనాడుకు చెందిన గోవిందు మృతిచెందగా గుడిపల్లె మండలం శ్రీనివాసపురానికి చెందిన నాగరాజు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏనుగుల దాడుల పట్ల జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగులు బీభత్సం.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు.. ఎక్కడంటే..? - చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం
Elephants attack: కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వీటి దాడిలో ఒకరు చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఏనుగుల దాడుల పట్ల జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగులు బీభత్సం