చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురం, గంగాధర నెల్లూరు మండలాల్లో రెండు ఏనుగులు నలుగురిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. మృతుడు జీడీ నెల్లూరు మండలం వేల్పూరు ఇందిరానగర్లో నివాసముండే వజ్రవేలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఒకరు మృతి - చిత్తూరు జిల్లా నేర వార్తలు
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గజరాజుల దాడిలో ఒకరు మృతి చెందగా... ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
![చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఒకరు మృతి man-died-in-elephant-attack-in-chithore-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11904655-411-11904655-1622021919417.jpg)
ఏనుగుల దాడి... ఒకరు మృతి