చిత్తూరు నగరంలోని రాంనగర్ కాలనీ వివేకానంద వీధికి చెందిన సయ్యద్ తాజ్ (30) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇతనికి తిరుత్తణి ఇస్లాంనగర్‌కు చెందిన మోనిషా(21)తో మూడు నెలల కిందట వివాహమైంది. సయ్యద్ తాజ్ ఖతార్‌లో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. గతంలో ఖతార్‌లో ఓ మహిళతో సయ్యద్‌కు వివాహేతర సంబంధమున్నట్లు గుర్తించిన భార్య.. తన పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య.. - suicide news in ramnagar colony news
చిత్తూరులోని రాంనగర్ కాలనీ వివేకానంద వీధికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాననటంతో అతను బలవర్మణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
భార్యను కాపురానికి రావాలంటూ సయ్యద్ అత్తవారి ఇంటికి వెళ్లి పిలిచాడు. ఆమె కాపురానికి రాకపోగా.. భార్య తరపు బంధువులు అతన్ని కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన అతను తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. గదిలోని గోడలు, బీరువాపై తన చావుకి.. అత్తింటివారు బాధ్యులని రాసివున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి..భర్తకు గాయాలు