ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానసిక ఒత్తిడితో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - తిరుపతి తాజా వార్తలు

మానసిక ఒత్తిడితో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి ఖాదీకాలనీలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Man commits suicide in Tirupati
తిరుపతిలో మానసిక ఒత్తిడితో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

By

Published : Sep 23, 2020, 11:00 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతి ఖాదీ కాలనీలోని అపార్ట్​మెంట్​లో అభిషేక్ శేఖర్ (26) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని స్థానిక ఖాదీకాలనీలోని సత్యం అపార్ట్​మెంట్ నందు సీబ్లాక్​లో రాజశేఖర్ కుమారుడు అభిషేక్ శేఖర్ నివాసముంటున్నారు. ఇతను బీఫార్మసీ చదివి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనంచేస్తుండగా... అతను గదిలోనే ఉన్నాడు. తర్వాత కుటుంబ సభ్యులు తలుపుతట్టి చూసేసరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేంద్ర కుమార్ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details