ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకు రుణాల పేరిట కోట్లు స్వాహా చేసిన వ్యక్తి అరెస్ట్ - ఆర్థిక నేరస్థులతో ప్రజలు అప్రమత్తం

అతను ఏపీ ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగిగా పరిచయం చేసుకుంటాడు. పీఎన్​జీవై పథకంలో భాగంగా బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలుకుతాడు. అందుకు కొంచెం ఖర్చు అవుతుందని కట్టుకథలు చెబుతాడు. మొత్తానికి నగదు వసూలు చేస్తాడు. తరువాత ఆచూకీ లేకుండా పోతాడు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 60మందిని మోసం చేశాడు. కోట్లు స్వాహా చేసి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాలు తెలియాలంటే చదివేయండి మరి..!

Man arrested
కోట్లు స్వాహా చేసిన వ్యక్తి అరెస్ట్

By

Published : Nov 22, 2020, 5:44 PM IST

బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ నగదు తీసుకుని, మోసాలకు పాల్పడుతున్న తోట బాలాజీ నాయుడిని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏపీ ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​లో డిప్యూటీ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకునేవాడని డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. పీఎన్​జీవై పథకంలో భాగంగా బ్యాంక్ ​నుంచి రుణం ఇప్పిస్తానని పలువురి వద్ద నగదు తీసుకుని మోసం చేసినట్లు వివరించారు.

ఇటీవల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.రెండున్నర లక్షలు వసూలు చేసి, మోసగించినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తోట బాలాజీని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు ఇప్పటివరకు సుమారు 60 మందిని నమ్మించి కొన్ని కోట్లరూపాయలు కొల్లగొట్టినట్లు వెల్లడించారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా 33 కేసులు నమోదయినట్లు డీఎస్పీ తెలిపారు. ఆర్థిక నేరస్థులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details