చిత్తూరు జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకం జారీకి లంచం డిమాండ్ చేసిన వీఆర్వో.. అనిశా వలలో చిక్కాడు. రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ వీఆర్వో రామనాథం. ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రూ.8500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు.. అనిశాను ఆశ్రయించాడు. ఈ మధ్యాహ్నం తన కార్యాలయంలో నగదు తీసుకుంటూ ఏసీబీ ఆధికారులకు చిక్కాడు. విచారణ అనంతరం వీఆర్వోను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ వీఆర్వో - VAO arrested for taking bribe at chittoor
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో ఓ వీఆర్వో లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. పాసుపుస్తకాలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు.. ఏసీబీ ఆధికారులను ఆశ్రయించాడు.
అనిశాకు చిక్కిన వీఆర్వో