ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీఎస్​పీడీసీఎల్​లో భారీ అగ్ని ప్రమాదం... ఘటనపై విచారణ - apspdcl fire accident latest news

చిత్తూరులోని ఏపీ విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్ల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 200 ట్రాన్స్​ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు, విద్యుత్​ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విద్యుత్​ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

major accident happened in apspdcl in chitoor
ఏపీఎస్​పీడీసీఎల్​లో భారీ అగ్ని ప్రమాదం

By

Published : May 30, 2020, 11:54 PM IST

చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఏపీ విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్ల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని.. అగ్ని కీలలు‌ భారీగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 ట్రాన్స్​ ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యి... రూ.కోట్లల్లో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి అగ్ని మాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అగ్ని కీలలు భారీగా ఎగసిపడటంతో చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్ని ప్రమాదం వివరాలు తెలుసుకున్న చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, విద్యుత్​ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.‌ ప్రమాదానికి విద్యుదాఘాతం కారణమా... లేక అక్కడి సిబ్బంది పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details