మహాశివరాత్రి పర్వదినం..పులకించిన భక్తకోటి
మహాశివరాత్రి పురస్కరించుకొని.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నంది, సింహవాహనంపై ఆదిదంపతులను ఊరేగించారు. జాగారం చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
మహాశివరాత్రి పర్వదినం భక్తకోటి.. ఆనందించె
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమస్కందమూర్తికి నంది వాహన సేవ నిర్వహించారు. విశేష స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమైన స్వామివారు నందీశ్వరునిపై, జ్ఞానాంబిక అమ్మవారు సింహంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపం నుంచి తీసుకొచ్చిన ఉత్సవమూర్తులను పట్టణ పురవీధుల్లో ఊరేగించారు.