మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని... తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలోని ధ్యానారామంలో తితిదే ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తితిదే చేపట్టిన మాఘ మాస ఉత్సవాల్లో భాగంగా... భారీ శివలింగానికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పదకొండు ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం, నమక చమక మంత్రసహితంగా అభిషేకించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, ఎస్వీ వేద వర్సిటీ ఆచార్యులు, వేదపండితులు పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు - ttd latest news
తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో తితిదే ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివునికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు.
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు