amravati-farmers: హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజకి నివాళి ఆర్పించిన తర్వాత అమరావతి మహాపాదయాత్ర 42వ రోజును రైతులు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని అంజిమేడు నుంచి రేణిగుంట వరకు మహాపాదయాత్ర దాదాపు 11కి.మీ సాగనుంది. ఇసుకతాగేలి, మల్లవరం, ఎగువ మల్లవరం మీదుగా గుతివారి పల్లె వరకు మహాపాదయాత్ర సాగనుంది. గుత్తివారిపల్లిలో భోజన విరామం అనంతరం వేదళ్ల చెరువు, గురవరాజుపల్లె మీదుగా రేణిగుంట మహాపాదయాత్ర వరకు సాగనుంది.
amravati-farmers: 42వ రోజుకు చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర
amravati-farmers: అమరావతి మహాపాదయాత్ర 42వ రోజును రైతులు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని అంజిమేడు నుంచి రేణిగుంట వరకు మహాపాదయాత్ర దాదాపు 11కి.మీ సాగనుంది.
రాయలసీమ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని ఎస్వీయూ విద్యార్థులు స్పష్టం చేశారు. రేణిగుంట సమీపంలో రాజధాని రైతుల మహాపాదయాత్ర 42వ రోజున ఎస్వీయూ విద్యార్థులు రైతులకు సంఘీభావంగా పాదం కలిపారు. రాయలసీమ అభివృద్ధి అంటే అన్ని రకాల అభివృద్ధి కానీ కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుకాదని విద్యార్థులు తేల్చిచెప్పారు. ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని నినాదానికి అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఏకం చేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి:PAWAN KALYAN PROTEST : మంగళగిరి కార్యాలయంలో... జనసేన ఉక్కు పరిరక్షణ దీక్ష