ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మధులత భర్త మృతదేహం గుర్తింపు - boat accident

తిరుపతికి చెందిన మధులత కుటుంబంలో బోటు ప్రమాదం తీరని విషాదం నింపింది. గోదావరిలో గల్లంతైన భర్త, బిడ్డ క్షేమంగా తిరిగిరావాలని ఆమె దేవుళ్లకి కన్నీళ్లతో మొక్కినా ఫలితం లేదు. విధి ఆమెను ఒంటరిగా మిగిల్చింది. సోమవారం ఆమె కుమార్తె మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఆమె భర్త మృతదేహాన్ని గుర్తించారు.

మధులత

By

Published : Sep 18, 2019, 1:48 AM IST

తండ్రి హస్తికలను గోదావరిలో కలిపేందుకు వెళ్లిన సుబ్రమణ్యం కుటుంబంలో ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం, ఆయన కూతురు హాసిని గల్లంతుకాగా, భార్య మధులత ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం హాసిని మృతదేహం లభ్యమయింది. సుబ్రమణ్యం మృతదేహాన్ని ఇవాళ బంధువులు గుర్తించారు. మొదటగా హాసినీని గుర్తించిన కుటుంబసభ్యులు.. సుబ్రమణ్యం మృతదేహం పాడైపోవటంతో వేసుకున్న దుస్తులు, ఆభరణాల ఆధారంగా అతనే అని తేల్చారు.
శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు ఇవాళ అప్పగించారు. వారు అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని సుబ్రమణ్యం సొంత గ్రామమైన పూతలపట్టు మండలం వేపనపల్లెకు బయలుదేరారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

సుబ్రమణ్యం కుటుంబం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details