మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి!
జెండాలు, అజెండాలు పక్కన పెట్టి తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ముందుకు సాగాలని మదనపల్లి జిల్లా సాధన సమితి అభిప్రాయపడింది.
madhanapally_people_watnts_madhanapally_as_a_district
మదనపల్లి జిల్లా సాధన సమితి సమావేశం గురువారం జరిగింది. పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయలను తెలిపారు. మదనపల్లె ప్రజలు ముందుగా మేల్కోని ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి సౌకర్యాలు, భవనాలు ఉన్నాయని సభ్యులు తెలిపారు.