ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైసా పైసా కూడబెట్టుకుని.. అజ్మీర్ యాత్రకు బయల్దేరారు.. ఇంతలోనే.. - కర్నూలు జిల్లా వెల్దూర్తి రోడ్డు ప్రమాదం న్యూస్

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా.. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మదనపల్లె బాలాజీ నగర్​లో నివాసముంటున్న రఫీ, జాఫర్, దస్తగిరి కుటుంబాలకు చెందిన వారిగా నిర్ధరణకు వచ్చారు.

madanapalli people on accident
madanapalli people on accident

By

Published : Feb 14, 2021, 10:33 AM IST

ఒకే కాలనీ లో వేర్వేరుగా నివాసం ఉంటున్న సోదరులు రఫీ, జాఫర్, దస్తగిరి... కుటుంబ సమేతంగా అజ్మీర్ దర్గా కు వెళ్లేందుకు... శనివారం రాత్రి మదనపల్లె నుంచి పయనమయ్యారు. టెంపో లో 18 మంది బయల్దేరి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అజ్మీర్ దర్గాకు వెళ్లాలని పైసా పైసా కూడబెట్టుకున్నారని తెలిపారు. సంతోషంగా వెళ్లి వస్తారనుకుంటే ఈ ఘోరం జరిగిపోయిందని స్థానికులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details