రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎస్సీ, ఎస్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెచ్చుమీరుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఎస్సీ, ఎస్టీలపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలలో జరిగిన ఘటనపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దాడుల్లో మృతిచెందిన వారికి కోటి రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే, ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
'వైకాపా ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి' - madanapalle sc st leaders agitation news
చీరాలలో జరిగిన ఘటనపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని.. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎస్సీ, ఎస్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.
మదనపల్లె ఎస్సీ, ఎస్టీ నాయకుల నిరసన