చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా చేయాలంటూ పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. వైకాపా ప్రభుత్వం.. గతంలో ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్నిమున్సిపల్ వైస్ చైర్మన్ భవాని ప్రసాద్ గుర్తు చేశారు. ఈ అంశాన్ని మిగిలిన కౌన్సిలర్లు బలపరిచి... ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం ద్వారా తెలియజేయాలని కోరారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ... వారివారి వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాపై చర్చించారు.
ఆఖరి సమావేశంలో ఆస్తి పన్నుపై చర్చ - చిత్తూరు జిల్లా మదనపల్లె
మదనపల్లి పట్టణ ప్రజలకు ఆస్తిపన్ను భారం తగ్గించడానికి... పాలకపక్షం చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ చివరి సమావేశం... చైర్మన్ కొడవలి శ్రీప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగింది.
![ఆఖరి సమావేశంలో ఆస్తి పన్నుపై చర్చ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3699781-1041-3699781-1561818333097.jpg)
మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం
మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం
ఇదీ చదవండీ...
Last Updated : Jun 30, 2019, 12:05 AM IST