ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయగీతం జనగణమనపై.. నోరు జారిన ఎమ్మెల్యే! - madanapalle Mla controversy national anthem at chittoor

మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా... జాతీయగీతం జనగణమనపై నోరు జారారు. మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో అధికారులతో సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. జనగణమన గీతాన్ని... జిడ్డు కృష్ణమూర్తి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారని నోరు జారారు.

madanapalle Mla  controversy national anthem at madhanapalle
జాతీయగీతం జనగణమన పై నోరు జారిన ఎమ్మెల్యే

By

Published : Jun 13, 2020, 10:31 PM IST

జాతీయగీతం జనగణమన పై నోరు జారిన ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా... జాతీయగీతం జనగణమనపై నోరు జారారు. మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. జాతీయ గీతం జనగణమనను... జిడ్డు కృష్ణమూర్తి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారన్నారు. మదనపల్లె లో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న బీటీ కాలేజ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన... అక్కడే జిడ్డు కృష్ణమూర్తి... జనగణమనను బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు అంటూ నోరు జారారు.

తన తప్పును గ్రహించకుండానే... ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రసంగాన్ని కొనసాగించగా... అక్కడే ఉన్న అధికారులు, వైకాపా నాయకులు సైతం అడ్డు చెప్పలేదు. వాస్తవానికి జాతీయ గీతానికి.. మదనపల్లికి అవినాభావ సంబంధం ఉంది. 1919లో మదనపల్లి లోని ప్రఖ్యాత బెసెంట్ థియొసోఫికల్ కాలేజ్​కు విచ్చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్... ఇక్కడే జాతీయ గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన చారిత్రక అంశాన్ని ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేత.. వక్రీకరించి మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details