చిత్తూరు జిల్లాకు చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబుకు.. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి నోటీసులు పంపడంపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. డీఎస్పీ హద్దు మీరి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. ప్రతిపక్ష నాయకుడికి ఈ తరహా నోటీసు పంపడం దుర్మార్గపు పాలనకు నిదర్శనమని అన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాజకీయ నాయకులు, మీడియాకు నోటీసులు ఇచ్చుకుంటూ పోతారా అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. డీఎస్పీకి వైకాపాపై అంత అభిమానం ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్ వెనక తిరగొచ్చని వ్యాఖ్యానించారు.