చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో రహదారి ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదనపల్లికి రాగులతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బోల్తా... క్లీనర్ మృతి - చంద్రగిరి కనుమాదారిలో ప్రమాదం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో లారీ బోల్తా పడంది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
![లారీ బోల్తా... క్లీనర్ మృతి lorry accident at chandragiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7146597-1000-7146597-1589166476213.jpg)
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం