ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lokesh Fires on Nagari TDP Leader Attack Incident: 'ఏపీని ఆఫ్ఘనిస్థాన్​లా మార్చారు'.. నగరి టీడీపీ ఇంఛార్జ్ భానుప్రకాష్​పై దాడికి లోకేశ్ తీవ్ర ఆగ్రహం

Lokesh Fires on Nagari TDP Leader Attack Incident: టీడీపీ నేత గాలి భాను ప్రకాష్​పై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రం మరో అఫ్గానిస్తాన్​లా తయారయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతలు సైతం ఈ దాడిపై మండిపడ్డారు. భానుప్రకాష్​ను కలిసి తమ సంఘీభావం తెలిపారు.

Lokesh Fires on Nagari TDP Leader Attack Incident
Lokesh Fires on Nagari TDP Leader Attack Incident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 10:32 AM IST

Lokesh Fires on Nagari TDP Leader Attack Incident: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ మరో ఆఫ్ఘనిస్థాన్​లా తయారయ్యిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా నగరి ఏరియా ఆసుపత్రి వద్ద తెలుగుదేశం పార్టీ నగరి ఇంఛార్జ్ గాలి భానుప్రకాష్​పై వైసీపీ నేతలు దాడిపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదానం కార్యక్రమానికి వెళ్తున్న వారిని అడ్డుకొని మరీ దాడి చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనకి అంతిమ రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

నగరి నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి గాలి భానుప్రకాష్​పై వైసీపీ నాయకులు దాడి చేయటాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో భానుప్రకాష్​ను జనసేన నేతలు కలిసి.. సంఘీభావం తెలిపారు. రైతులకు, రోగులకు అన్నదానం చేసేందుకు జనసేన, టీడీపీ ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమాన్ని.. వైసీపీ అడ్డుకుంటూ దాడులకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ సమన్వయంతో మంత్రి రోజాను.. ఓడించడం ద్వారా తగిన బుద్ధి చెబుతామని తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ తెలిపారు.

YSRCP Followers Attack on TDP Leader Vehicle: నగరి టీడీపీ ఇంచార్జ్​ వాహనంపై వైసీపీ మూకదాడి.. ఉద్రిక్తత

అసలేం జరిగిందంటే..:జనసేన నేత కిరణ్‌రాయల్‌ సీఎం జగన్‌, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతను నగరిలో అన్నదానం కార్యక్రమానికి వస్తారని తెలిసి అతడిని అడ్డుకోవాలని వైసీపీ నాయకులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆఖరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దవడంతో ఆ విషయం తెలియని గాలి భానుప్రకాష్‌ అటువైపు రావడంతో ఆ సెగ ఆయనను తాకింది.

వైసీపీ శ్రేణులు ఆయన కారును అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమై వెనుదిరిగినా వెంబడించి మీరీ దాడి చేశారు. వైసీపీ నాయకుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో భానుప్రకాష్ కారు ముందు భాగం లారీకి తగిలి ధ్వంసమైంది. ఈ సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పరిస్థితి మరోలా ఉండేదని భానుప్రకాష్‌ తెలిపారు.

TDP Village President Died in YCP Leader Attack: వైసీపీ నేత దాడిలో టీడీపీ గ్రామాధ్యక్షుడు మృతి.. గ్రామస్థుల ఆందోళనతో ఉద్రిక్తత

భానుప్రకాష్‌ వాహనంపై దాడి చేయడం.. వెంబడించడంపై తీవ్ర ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు.. మంత్రి రోజా నివాస ముట్టడికి యత్నించారు. దీంతో శుక్రవారం నగరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే విధంగా భానుప్రకాష్‌పై దాడి విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గంలోని నాయకులంతా నగరికి తరలివచ్చి నిరసన తెలియజేశారు.

టీడీపీ వర్గీయుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు అడ్డుకున్నా ఆవేశంతో ర్యాలీగా పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. మంత్రి రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు భానుప్రకాష్‌ను నిలువరించే ప్రయత్నం చేయగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుతగిలారు. తనపై దాడికి తెగబడ్డ వారిని అరెస్టు చేయాలని గాలి భానుప్రకాష్‌ కోరారు.

YCP Followers attacked TDP workers: నిమజ్జనం కోసం వెళ్తూ... రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. తిప్పికొట్టిన టీడీపీ కార్యకర్తలు...

ABOUT THE AUTHOR

...view details