మిడతలతో బెంబేలెత్తుతున్న రైతులు - locusts damage crops at chittoor
నిన్నటి వరకు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురైనా రైతు నేేడు మిడతల కారణంగా భయందోళనకు గురవుతున్నారు. ఎక్కడ మిడతలు కనిపించినా రైతు వెన్నులో వణుకుపుడుతుంది. చిత్తూరు జిల్లాలో రైతులు మిడతల కారణంగా ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లోని పంట పొలాలపై మిడతలు దాడి చేస్తున్నాయని రైతులు భయాందోళనకు గురయ్యారు. కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడులోని వేపనపల్లి వద్ద మిడతల దాడులతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు వ్యవసాయ అధికార యంత్రాంగం ఆ గ్రామాలలో పర్యటించారు. మిడతలను పరిశీలించిన అనంతరం అవి ఉత్తరాది నుంచి వచ్చిన మిడతలు కాదని... దేశవాళీ మిడతలని అధికారులు స్పష్టం చేశారు. ఇవి జిల్లేడు మెుక్కలను మాత్రమే ఆశిస్తాయని రైతులకు అవగాహన కల్పించారు. రైతుల కొరిక మేరకు కొయంబత్తూరు ల్యాబ్ లో వీటిపై పరిశోధనలు జరుపుతామని వెల్లడించారు.