తిరుపతిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్. గిరీషా ప్రకటించారు. ఆగస్టు 14 వరకు నగరంలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరవాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. నగరంలో మరో 9 ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్ డౌన్ పొడిగింపు - తిరుపతిలో లాక్ డౌన్
తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
తిరుపతిలో లాక్ డౌన్