ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలారా... లాక్​డౌన్​కు సహకరించండి'

చిత్తూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేస్ బయటపడిన నేపథ్యంలో పోలీసులు ప్రజలెవరినీ బయటకు రానివ్వడం లేదు. ఆంక్షలకు విరుద్ధంగా.. రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

lockdown at tirupati
తిరుపతిలో పోలీసుల పహారా

By

Published : Mar 25, 2020, 1:49 PM IST

చిత్తూరులో లాక్ డౌన్

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. కరోనా వైరస్ అరికట్టేలా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా నివాసాలకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసర సేవల వాహనాలు, వైద్య సిబ్బంది మినహా మరెవరూ రహదారులపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పనిలేకుండా బయటికి వచ్చినా వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దంటూ ప్రజలను కోరారు.

తిరుపతిలో పోలీసుల పహారా

ABOUT THE AUTHOR

...view details