తిరుపతిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమానులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. మరోవైపు 20 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న డివిజన్లలో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేస్తోంది. 18 డివిజన్లలో పాజిటివ్ కేసులు అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో బుధవారం నుంచి లాక్డౌన్ అమలుకు నగరపాలక సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
'కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా లాక్డౌన్' - chittoor district latest news
తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నగరంలో అనధికార లాక్డౌన్ అమలవుతోంది. వాణిజ్య, వ్యాపార సంస్థల యాజమానులు స్వచ్ఛందంగా దుకాణాలను మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మూసివేస్తున్నారు.
'కంటైన్మెంట్ జోన్లో కఠినంగా లాక్డౌన్'
తిరుపతి నగరంలో 164 కంటైన్మెంట్ జోన్లు ఉండగా..18 వార్డుల పరిధిలో ఆంక్షలను కఠినతరం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టిసారించి... ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నామని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విస్తృత చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా తెలిపారు.