చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట ప్రధాన రహాదారిపై కాజ్‌వే దాటుతూ.. వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. గోవిందవరం సమీపంలో స్వర్ణముఖి నది కాజ్‌వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలో చెల్లూరు గ్రామానికి చెందిన శంకరయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ, కుమారుడు కాజ్ దాటుతుండగా.. వరద నీటిలో చిక్కుకున్నారు. స్థానికులు గుర్తించి పరిగెత్తుకెళ్లి గట్టుకు తీసుకువస్తుండగా.. మరోసారి అదుపుతప్పి కొద్ది దూరం కొట్టుకుపోయారు. దీంతో మరింత అప్రమత్తమై.. ముగ్గురినీ సురక్షితంగా కాపాడి బయటకు తీసుకువచ్చారు.
LIVE VIDEO : కాసేపైతే జలసమాధే.. వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు! - స్వర్ణముఖీ నది కాజ్‌వేపై భారీ వరద
చిత్తూరు జిల్లా స్వర్ణముఖి నది కాజ్‌వేపై కొందరు రోడ్డు దాటుతుండగా.. వారిలో ముగ్గురు వరద నీటిలో చిక్కుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే వారిని కాపాడి బయటకు తీసుకువచ్చారు.
వరదనీటిలో కొట్టుకుపోయిన ముగ్గురు పాదచారులు.. కాపాడిన స్థానికులు