ఆహారంలో బల్లి...25 మంది విద్యార్థులకు అస్వస్థత ! - ఆహారంలో బల్లి...25 మంది విద్యార్థులకు అస్వస్థత !
తిరుపతి న్యాక్ శిక్షణాకేంద్రంలో ఆహారం కలుషితమైంది. బల్లి పడిన ఆహారం తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వసతి గృహానికి బయట నుంచి తీసుకొచ్చిన ఆహారంలో బల్లి పడినట్లు విద్యార్థులు చెబుతున్నారు.
బల్లి పడిన ఆహారం తిని 25 మంది న్యాక్ శిక్షణార్థులు ఆస్పత్రిలో చేరిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్‌లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు బల్లిపడిన ఆహారం తినడం వల్ల వాంతుల బారిన పడ్డారు. వారు భోజనం చేస్తుండగా ఆహారంలో చనిపోయిన బల్లిని గుర్తించారు. ఈ విషయంపై నిర్వాహకులకు సమాచారమివ్వగా... అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఆహారం విషయంలో నిర్వాహకులు అశ్రద్ధ వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని శిక్షణార్థులు ఆరోపించారు. కాగా బయట నుంచి తీసుకురావడం వల్లే అపశృతి చోటుచేసుకుందని నిర్వాహకులు తెలిపారు.
TAGGED:
Lizard in food