ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక మద్యం తరలింపును అడ్డుకున్న పోలీసులు - liquor news in chittoor dst'

కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లాకు మద్యం తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం సమీపంలో 74 మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

liquor seized in chittor dst thamballapalli from karnataka
liquor seized in chittor dst thamballapalli from karnataka

By

Published : May 13, 2020, 1:38 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండల పరిధిలోని ఉప్పరల్లపల్లి వద్ద.. కర్ణాటక నుంచి మద్యం తీసుకొస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 74 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని చిత్తూరు జిల్లా పరిధిలోకి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details