చిత్తూరు జిల్లాలోని ఆంధ్ర తమిళనాడు సరిహద్దులలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగిరి మండలంలో ఓజీ కుప్పం గ్రామం వద్ద పోలీసుల చేపట్టిన తనిఖీల్లో తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న 125 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిండ్ర మండలం ఇరుకువాయి గ్రామానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మోటార్ బైక్‌లో వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఇరువురి పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు నగిరి సిఐ మద్దయ్య ఆచారి తెలిపారు.
తమిళనాడు నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత - liquor seized news in chittoor dst
తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని చిత్తూరు జిల్లా కుప్పం గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. 125 మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నగరి సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు.
liquor seized in chittoor dst thamilanadu