చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మూడు ద్విచక్ర వాహనాల్లో 30 లీటర్ల నాటుసారా తరలిస్తుండగా వారిని అరెస్టు చేసి సారాను స్వాధీనం చేసుకున్నారు. తానావడ్డిపల్లికి చెందిన నిందితులు దొరబాబు, వెంకటరమణ, రామకృష్ణ, ఎల్లప్పను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పీలేరులో ఎక్సైజ్ అధికారుల దాడులు
చిత్తూరు జిల్లా పీలేరు మండలం తానా వడ్డిపల్లి వద్ద జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. 30లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
iquor seized in chittoor dst