Liquor Sales time extension: నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని మద్యం దుకాణాలు, బార్లలో మద్య విక్రయ సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ నిర్వహించే మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాల సమయాన్ని అర్దరాత్రి 12 గంటల వరకూ , హోటళ్లు, ఈవెంట్లు, బార్లలో విక్రయ సమయాన్ని రాత్రి 1 గంట వరకూ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 31 తేదీతో పాటు 1 తేదీ మొత్తంగా రెండు రోజుల పాటు అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాల్లో, బార్లు, హోటళ్లు, ఈవెంట్ ప్రదేశాల్లో రాత్రి 1 గంటల వరకూ మద్యం విక్రయాలు చేసుకునేందుకు సమయాన్ని పొడిగిస్తూ ఆబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో అక్రమ మద్యం, నాటు సారా విక్రయాలపై నియంత్రణ పెట్టాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
కొత్త సంవత్సరం వేళ మందు బాబులకు శుభవార్త
Liquor Sales time extension: నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని మద్యం దుకాణాలు, బార్లలో మద్య విక్రయ సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్బంగా మద్యం విక్రయాల సమయాన్ని అర్దరాత్రి 12 గంటల వరకూ , హోటళ్లు, ఈవెంట్లు, బార్లలో విక్రయ సమయాన్ని రాత్రి 1 గంట వరకూ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం