సినీ ఫక్కీలో అక్రమంగా కారు డోర్లో మద్యం రవాణా చేస్తున్న సీఆర్పీఎఫ్ మాజీ జవాన్‌ను చిత్తూరు జిల్లా వి.కోట పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక మద్యాన్ని రాష్ట్రంలోకి అక్రమంగా తీసుకొస్తున్న నిందితుడి కారును పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. సోదాలు నిర్వహించే క్రమంలో కారు డ్రైవర్ పారిపోయేందుకు యత్నించడంతో కారును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు డోర్లో 310 కర్ణాటక మద్యం బాటిళ్లను గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యల్లం రాజు తెలిపారు.
పోలీసులకు చిక్కిన సీఆర్పీఎఫ్ మాజీ జవాన్.. కారు డోరులో.. !
కాదేది అక్రమ రవాణాకు అనార్హం అన్నట్లుంది మద్యం అక్రమార్కుల పరిస్థితి. ఆటో ఇంజన్‌లోనూ.. కారు డిక్కీ, సీట్లల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ మద్యం అక్రమ రవాణ చేస్తున్నారు. ఇదే కోవలో సీఆర్పీఎఫ్ మాజీ జవాన్ కారు డోర్లో పెద్ద ఎత్తున మద్యం అక్రమ రవాణాకు పాల్పడి.. అడ్డంగా పోలీసులు చిక్కాడు.
కారు డోరులో మద్యం అక్రమ రవాణా