అక్రమంగా తరలిస్తున్న మద్యం, బంగారం పట్టివేత - latest crime news in chittoor district
తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని చిత్తూరు జిల్లా రాయలచెరువులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మద్యం బాటిళ్లతో పాటు రూ.2 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం, బంగారం పట్టివేత
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు వద్ద స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.70వేలు విలువ చేసే మద్యం బాటిళ్లతో పాటు సుమారు రూ.2 లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కారుతో పాటు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగసుబ్బన్న తెలిపారు. ఈ దాడుల్లో రామచంద్రాపురం ఎస్ఐతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.