ఆటస్థలంలోగ్రంథాలయం నిర్మిస్తుండంపై గ్రామస్థుల ఆందోళన
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లి గ్రామపంచాయతీలో ఆటస్థలం ఉంది. కానీ అధికారులు దాన్ని గ్రంథాలయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. పిల్లలకు ఆటస్థలం లేకుండా గ్రంథాలయం నిర్మించటం ఏంటని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.