ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో అర్ధరాత్రి చిరుత సంచారం..! - తిరుమలలో యదేచ్ఛగా తిరుగుతున్న వన్యప్రాణులు

తిరుమల కొండపై భక్తుల సంచారం లేదు. జంతు సంచారం ఎక్కువైంది. కరోనా ప్రభావంతో భక్తులకు అనుమతి నిలిపేశారు. వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.

Leopard Wandering on Thirumala Hill
తిరుమలలో అర్ధరాత్రి చిరుత సంచారం

By

Published : Mar 24, 2020, 4:39 PM IST

తిరుమలలో అర్ధరాత్రి చిరుత సంచారం..!

తిరుమల కొండపై వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఈ నెల 31 వరకు కొండపైకి భక్తులకు అనుమతిని తితిదే నిలిపేసింది. కొండపై భక్త సంచారం లేక చిరుతలు, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో చిరుత పులి ఓ జంతువును వేటాడింది. అటవీ సిబ్బంది వాహనాన్ని గమనించి నక్కినక్కీ చూసింది. ఆ తరువాత అక్కడినుంచి వెళ్లిపోయింది. నారాయణగిరి, కల్యాణ వేదిక వద్ద జంతువుల అరుపులు వినిపిస్తున్నట్లు విధుల్లో ఉన్న సిబ్బంది తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details