ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Leopard : తిరుమలలో చిరుత సంచారం... భయాందోళనలో భక్తులు - leopard wandering in thiruamala

తిరుమల (thirumala) మొదటి కనుమదారిలో చిరుత (leopard) సంచరించడాన్ని యాత్రికులు గుర్తించారు. భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తితిదే అటవీ విభాగ సిబ్బంది(ttd forest officers) అప్రమత్తమయ్యారు.

తిరుమలలో చిరుత సంచారం
తిరుమలలో చిరుత సంచారం

By

Published : Jul 11, 2021, 8:23 PM IST

తిరుమలలో చిరుత సంచారం

తిరుమల కనుమ దారిలో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. మొదటి కనుమ దారిలోని ఏనుగుల ఆర్చి వద్ద అటవీ ప్రాంతంలో జింకను వేటాడుతూ చిరుత రహదారిపైకి వచ్చింది.

జింక తప్పించుకోవడంతో రహదారి పక్కనే నక్కిన చిరుత... అక్కడే కొంత సమయం మాటు వేసింది. సమాచారం అందుకున్న అటవీ విభాగం భద్రతా సిబ్బంది... భక్తులను అప్రమత్తం చేశారు. చిరుత సంచారాన్ని వాహన దారులు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు.

ABOUT THE AUTHOR

...view details