చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్రోడ్డుపల్లిలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. దానామూర్తి కోనకు చెందిన సుబ్రహ్మణ్యం మేకలను శేషాచల అటవీ సమీపంలోకి తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం చిరుత దాడి చేసి మేకను ఎత్తుకెళ్తుండగా చూసిన సుబ్రహ్మణ్యం భయంతో కేకలు వేశాడు. దీంతో చిరుత పులి మేకను వదిలి అడవిలోకి పారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండవ సారి చిరుత పులి మేకలపై దాడి చేయటంతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతను గ్రామాల వైపు రాకుండా చూడాలని కోరుతున్నారు.
చిరుత పులి సంచారం...భయాందోళలో గ్రామస్థులు - చిత్తురు జిల్లా వార్తలు
చంద్రగిరి మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు వారాల క్రితం పశువుల కాపరులు చిరుతను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అయితే అధికారులు పాదముద్రలు గుర్తించి పెద్ద నక్కగా నిర్ధారించారు. శనివారం సాయంత్రం ఏకంగా మేకను ఎత్తుకెళ్తున్న చిరుతను చూసి పశువుల కాపరులు కేకలు వేశారు. భయపడిన చిరుత మేకను వదిలి అడవిలోకి పారిపోయింది.
చిరుత పులి దాడిలో మృతి చెందిన మేక