ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి నగరపాలక కార్యాలయం ఎదుట వామపక్షాల నిరసన

తిరుపతి నగరపాలక కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పన్నులు రద్దు చేయాలంటూ నగరపాలక సంస్థ ఎదుట వామపక్షాలు నిరసన చేపట్టాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని... నిరసనకారులను స్టేషన్​కు తరలించారు.

By

Published : Jul 22, 2021, 11:49 AM IST

Updated : Jul 22, 2021, 3:16 PM IST

left parties protest
వామపక్షాల నిరసన

తిరుపతి నగరపాలక సంస్ధ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జరగనున్న నగరపాలక సంస్ధ సర్వసభ్యసమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్షాల నేతలు ప్రయత్నించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను చివరకు ఖాళీస్ధలాలకు సైతం పన్ను విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని నేతలు ఆరోపించారు.

తిరుపతి నగరపాలక కార్యాలయం ఎదుట వామపక్షాల నిరసన

సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వామపక్షాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వామపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేడు జరగనున్న సమావేశంలో పన్నుల వసూళ్లపై తీర్మానం చేయనుండటంతో సమావేశాన్ని అడ్డుకుంటున్నామని వామపక్ష నేతలు తెలిపారు. నిరసనకారులను తూర్పు పోలీస్ స్టేషన్​కు తరలించారు..

ఇదీ చదవండి

ttd: ప్రకృతిసిద్ధ సంచుల్లో.. శ్రీవారి ప్రసాదం!

Last Updated : Jul 22, 2021, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details