ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అప్పుడు చెప్పిన ఉచిత కరెంట్ హామీ ఏమైంది?'

సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కరోనా లాంటి కష్ట సమయంలో ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం మోపారని.. వామపక్ష నాయకులు విమర్శించారు. పెరిగిన కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా తిరుపతిలో ధర్నా చేపట్టారు.

left parties dharna against high electricity bills in tiurpathi
తిరుపతిలో వామపక్షాల ధర్నా

By

Published : May 18, 2020, 12:17 PM IST

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి.. నేడు పేద ప్రజలపై వేలాది రూపాయల ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు.

కరోనా నేపథ్యంలో పనుల్లేక, ఉపాధి కోల్పోయి అల్లాడుతుంటే.. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఏమిటని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఛార్జీలు రద్దు చేసి.. పాత స్లాబ్ ప్రకారం కరెంటే బిల్లులు వసూలు చేయాలని వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి.. మూగజీవాల ఆకలి తీరుస్తున్న కానిస్టేబుల్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details