తిరుపతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో లాయర్లు నిరసన దీక్ష చేపట్టారు.
న్యాయవాదుల నిరసన
By
Published : Feb 27, 2019, 4:55 PM IST
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు డిమాండ్
హైకోర్టు బెంచ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... న్యాయవాదుల సంఘం నిరసన దీక్ష చేపట్టింది. తిరుపతి న్యాయస్థానం వద్ద చేస్తున్న ధర్నాకు నగర ఎమ్మెల్యే సుగుణమ్మ సంఘీభావం తెలిపారు. రాయలసీమ ప్రజల సమస్యలు తీర్చడానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.