ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్రం ప్రారంభం - Nature agricultural Farming Products

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో రైతులు ప్రకృతి వ్యవసాయ రంగంపై మక్కువ చూపుతున్నారు. విష ప్రభావం లేని పంట దిగుబడుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో వివోల ద్వారా ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్రం ప్రారంభం
ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్రం ప్రారంభం

By

Published : Nov 11, 2020, 10:14 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో గ్రామాల్లో వివోల ద్వారా ప్రకృతి వ్యవసాయ వనరుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లి గ్రామ పరిధిలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది దుకాణాన్ని ప్రారంభించారు.

ప్రకృతి వ్యవసాయ విధానంతో..

ఈ దుకాణంలో ప్రకృతి వ్యవసాయ విధానంతో తయారు చేసిన క్రిమి సంహారక మందులు, ఎరువులను విక్రయిస్తారు. వెలుగు వివో ద్వారా రూ.30 వేల రూపాయలు అప్పుగా తీసుకుని స్థానిక మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం వనరుల కేంద్రం దుకాణాన్ని ప్రారంభించినట్లు ఏవో లీలాకుమారి, లక్ష్మీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

క్రిమి సంహారక రహితంగా..

రైతులు ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో క్రిమి సంహారక మందులరహితంగా ఎరువులు తీసుకుని ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు.

ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్​కే దక్కుతుంది: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details