ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో.. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి..

చిత్తూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పూలమాలలతో మహానేత విగ్రహానికి నివాళులర్పించి.. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకున్నారు. పలు చోట్ల రక్త దానం, అన్నదాన కార్యక్రమాలను నేతలు నిర్వహించారు.

late ntr death anniversary in chittoor district
చిత్తూరు జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

By

Published : Jan 18, 2021, 5:36 PM IST

మదవపల్లిలో..

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గం బాధ్యులు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రమేష్ ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేశారు. చిన్నబాబు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం, రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి ఎన్టీఆర్​పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే స్ఫూర్తితో నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేసి రానున్న ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

పుత్తూరులో..

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎన్టీఆర్ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిలో దివంగత ఎన్టీఆర్ చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు నేడు మన కళ్ళముందు ఉన్నాయని తెదేపా నగరి నియోజవర్గం గాలి భానుప్రకాష్ గుర్తుచేసుకున్నారు. అలాంటి మహానుభావుడిని స్మరించుకోవడం తెదేపా నాయకులు, కార్యకర్తల విధి అన్నారు. కార్వేటినగరం రోడ్​లో టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల నాయుడు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి:భాజపాపై మంత్రి విమర్శలు.. విచిత్రం: భానుప్రకాష్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details