ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Donation to TTD: తితిదేకు భారీ విరాళాలు.. ఉదయాస్తమానం ద్వారా రూ.85 కోట్లు.. ఓ కుటుంబం రూ.9.20 కోట్లు - ఉదయాస్తమానం సేవ

ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా రూ.85 కోట్లు విరాళాలు వచ్చాయని తితిదే చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే ఓ కుటుంబం స్వామివారికి భారీ ఎత్తున విరాళం అందజేసినట్లు చెప్పారు.

tirumala
tirumala

By

Published : Feb 18, 2022, 8:03 AM IST

Updated : Feb 18, 2022, 11:46 AM IST

ఉదయాస్తమాన సేవాటికెట్ల ద్వారా తితిదేకు రూ.85 కోట్లు విరాళంగా అందిందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అందులో శుక్రవారానికి సంబంధించిన టికెట్లు పూర్తిగా భక్తులు కొనుగోలు చేశారని వెల్లడించారు. తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భక్తుల నుంచి ఇలా విరాళంగా స్వీకరించి వారికి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేశామని తెలిపారు.

రూ.9.20 కోట్ల విరాళం

చెన్నై మైలాపూర్‌కు చెందిన డాక్టర్‌ పర్వతం పేరిట ఉన్న రూ.9.20 కోట్ల విలువైన ఆస్తులు, నగదు డిపాజిట్లను ఆమె సోదరి రేవతి విశ్వనాథం తితిదేకు విరాళంగా ఇచ్చారు. పర్వతం చనిపోవడంతో ఆమె జ్ఞాపకార్థం రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీవారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

తితిదేకు రూ.9.20 కోట్లు విరాళం

ఇది చదవండి:

TTD BUDGET: తితిదే బడ్జెట్ 3,096 కోట్లు...త్వరలో ఆర్జిత సేవల పునరుద్ధరణ

Last Updated : Feb 18, 2022, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details