Lance Naik Sai Teja Died: జనవరి నుంచి మీతోనే ఉంటానని చెప్పాడని.. అంతలోనే శాశ్వతంగా దూరమైపోయాడని అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ భార్య శ్యామల కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లల్ని చూడాలనిపిస్తోందని.. జనవరిలోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పారని.. కానీ అంతలోనే దారుణం జరిగిపోయిందని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు తమతో వీడియోకాల్ ద్వారా మాట్లాడిన సాయితేజ దూరమయ్యారంటే.. నమ్మలేకపోతున్నామని శ్యామల బోరున విలపించారు.
వాదించి మరీ సైన్యంలో చేరాడు: సాయితేజ తండ్రి
Lance Naik Sai Teja Died in CDS Chopper Crash: సైన్యంలో చేరవద్దంటే వాదించి మరీ చేరాడని.. తన తమ్ముడినీ చేర్పించాడని సాయితేజ తండ్రి మోహన్ కన్నీరు పెట్టుకున్నారు. సాయితేజ మృతి సమాచారం తెలుసుకున్న బంధువులు, మిత్రులు చిత్తూరు జిల్లా ఎగువరేగడ పల్లె గ్రామానికి చేరుకుంటున్నారు. సాయితేజ అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.